డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి : డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అధికారులకు ఆదేశించారు. మియాపూర్ డివిజన్ పరిధి మయూరి నగర్ కాలనీలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ పనులను స్థానిక నాయకులు , కాలనీ వాసులతో కలసి పరిశీలించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మాయూరి నగర్ కాలనీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రిక ప్రసాద్ గౌడ్, తిలక్, హరిబాబు, కేశవ్, వేణు, సుభాష్, వాటర్ వర్క్స్ వర్క్ ఇన్స్పెక్టర్ లింగయ్య, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here