నమస్తే శేరిలింగంపల్లి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా వరద నీరు నాలాలోకి సాఫీగా వెళ్లేందుకు పైపులైన్ పనులు వేగంగా పూర్తి చేయాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని గోపనపల్లి, గోపనపల్లి తండా లో వరద నీటి సమస్యపై అధికారులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పర్యటించారు.
వర్షాకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మాన్ సున్, ఎమర్జెన్సీ టీమ్ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, ఏఈ సునీల్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షుడు శ్రీరాములు, సీనియర్ నాయకులు రంగస్వామి, సురేష్ నరేందర్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.