నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో కాలనీలు వరద ముంపునకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి చెప్పారు. భారీ వర్షం కారణంగా చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీకి ఆనుకుని ఉన్న నాలా కట్ట తెగిపోవడంతో జోనల్ కమిషనర్ శంకరయ్యతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. వరద నీరు నాలా ద్వారా జవహర్ కాలనీలోకి రావడంతో పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో చందానగర్ డివిజన్ పరిధిలో నాలాల విస్తరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. తెగిపోయిన నాలా కట్టను బాగు చేయాలని, మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మన్ సూన్ టిమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అనంతరం వేమన రెడ్డి కాలనీ ఎంఎన్ఆర్ స్కూల్ సమీపంలో, హుడా కాలనీ ఫేజ్ – 2 లో హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు, సహకార సంఘం మహిళలతో కలిసి స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మొక్కలు నాటారు. కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలన్నారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఈఈ శ్రీకాంతి, డీఈ స్రవంతి, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్, కాలనీ వాసులు టీఆర్ఎస్ నాయకులు శంకర్ రెడ్డి, సురేందర్, సత్యనారాయణ, శివ నారాయణ, జగదీశ్వరయ్య, ప్రభాకర్, రమేష్, విశ్వనాధం, లక్ష్మయ్య, నవీన్, శ్రీనివాస్ రెడ్డి, నాగి రెడ్డి, నరేందర్ భల్లా, కార్తీక్ గౌడ్, డీడీ అనిల్ కుమార్, సర్కిల్ మెనేజర్ చంద్రకాంత్, పీఓ ఉషారాణి, సీఓ లక్ష్మి, కాలనీ వాసులు, సహకార సంఘం మహిళలు, ఎంఎన్ఆర్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.