ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తుంది – గచ్చిబౌలిలో ఆస్పైర్ ఐటీ కంపెనీ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆస్పైర్ సాఫ్ట్ వేర్ కంపెనీని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, టీఅర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఐటి ఎగుమతులలో ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతుందని, దేశంలోనే అగ్రస్థానంలో ముందుకు వెళుతుందన్నారు.

ప్రభుత్వ విప్ గాంధీతో‌ కలిసి సాప్ట్ వేర్ కంపెనీని ప్రారంభిస్తున్న మంత్రి హరీష్ రావు

ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కృషితో ఐటీ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఐటీ రంగంలో శరవేగంగా ముందుకు వెళ్తున్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి ప్రాంతంలో ఆస్పైర్ సాఫ్ట్ వేర్ కంపెనీని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

సాప్ట్ వేర్ కంపెనీ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here