కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయి – ఎంసీపీఐయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గాదగోని రవి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడంలో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ దొందు దొందే అని ఎంసీపీఐ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి ఎద్దేవా చేశారు. ముజఫర్ అహ్మద్ నగర్ లో జరిగిన ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ స్థాయి పార్టీ సభ్యుల జనరల్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాదగోని రవి మాట్లాడుతూ బిజెపి ప్రజా సంస్థలను అమ్ముతూ ప్రైవేటుపరం చేస్తాయన్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికలలో గెలవడానికి అవకాశ వాదాన్ని ప్రదర్శిస్తుందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దోపిడీకి, వివక్షతకు గురవుతున్నామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ వి.తుకారాం నాయక్ మాట్లాడుతూ ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలపై పోరాడుతూనే ఉన్నామని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ బలమైన ప్రజా ఉద్యమాలను చేపడతామని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. కన్న శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.మల్లేష్, టి.అనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ ఆహ్వానితులు ఏ.పుష్ప, ఇ.కిష్టయ్య, పల్లె మురళీ మాట్లాడారు. ఈ సమావేశంలో పి.భాగ్యమ్మ, వై.రాంబాబు, డి.నరసింహ, రంగస్వామి, యాదగిరి, మధుసూదన్, రతన్ నాయక్, నాగభూషణం, విమల, లావణ్య, శివాని, పుష్పలత, ఈశ్వరమ్మ, వెంకట చారి, రవి,‌ రాంచందర్, గీత,‌ ఇంద్ర,‌ లక్మణ్, శంకర్, శరన్నప్ప, రాజు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

ఎంసీపీఐయూ సమావేశంలో మాట్లాడుతున్న గాదగోని రవి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here