నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో కూచిపూడి నృత్యప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. యంపీ థియేటర్ లో ప్రభాకర్ కిరణ్మయి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. రామ రామ భజన, దశావతరాలు, పరమ పురుషుడు, భో శంభో, దుర్గారావు, స్వాగతం కృష్ణ, వినాయక కౌతం, మహా గణపతిమ్, పుష్పాంజలి, కొలువైతివారంగా సాయి, బ్రహ్మాంజలి తదితర అంశాలను శ్రీ ప్రియా, సంజన, వర్ష, తన్మయీ, మధూషిక, హిమబిందు, సాయి శృతి తదితరులు ప్రదర్శించి పలువురిని ఆకట్టుకున్నారు. శేష సాయి ఫౌండర్ ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్, కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ సెక్రటరీ కెనడా సుధాకర్ రెడ్డి కళాకారులను సత్కరించారు.