నమస్తే శేరిలింగంపల్లి: నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తున్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పై, బిజెపి నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ ఎక్స్ రోడ్ లో గల బిజెపి కార్యాలయంలో జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఎంపీ అరవింద్ పై జరిగిన దాడి పట్ల ఆయన ఖండించారు. అన్ని ప్రభుత్వ శాఖలను సీఎం కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకుని క్రూరంగా, రజాకార్ల లాగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై టీఆర్ఎస్ దాడులకు ప్రోత్సహించడం సిగ్గుచేటు అన్నారు. బిజెపిని ఎదుర్కోలేక దాడులు చేయడం కెసిఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శనం అని అన్నారు. బెదిరింపులు, దాడులకు బిజెపి కార్యకర్తలు భయపడరని పేర్కొన్నారు. నియంతృత్వ, అవినీతి టీఆర్ఎస్ సర్కారుపై బిజెపి పోరాటం ఆగదు అన్నారు. అధికారాన్ని, చట్టాన్ని చేతిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. ఎంపీ అరవింద్ మీద చేసిన దాడికి టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న బిజెపిని అహంతో, అధికారంతో అణగదొక్కలేవని జ్ఞానేంద్ర ప్రసాద్ వెల్లడించారు.