శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణ దారుల నుంచి రక్షించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను కాపాడుతున్నామని చెబుతున్నారని, కానీ అనేక చెరువులను ఇప్పటికే ఆక్రమణదారులు కబ్జా చేశారని అన్నారు. ముఖ్యంగా హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని బచ్చుకుంటలో మట్టి నింపుతున్నారని, ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశామని అయినప్పటికీ ఇంత వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వెంటనే కబ్జాపై చర్యలు తీసుకోవాలని, చెరువును రక్షించాలని డిమాండ్ చేశారు. చెరువులో ఆక్రమణదారులు పోసిన మట్టిని తొలగించాలని అన్నారు.