శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ లక్ష్మీ నగర్ కాలనీలో డ్రైనేజీ లైన్ మళ్లించకుండా చెరువు సుందరీకరణ పేరుతో కనీస ప్రత్యామ్నాయం లేకుండా డ్రైనేజీ నీళ్లను కాలనీలోకి వదిలేయడం వలన కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు విజ్ఞప్తి చేయగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, బీజేపీ నాయకులు , కాలనీ వాసులతో కలిసి పర్యటించి సంబంధిత జిహెచ్ఎంసి ఉప కమిషనర్, ఇరిగేషన్, వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను నిలదీస్తామని ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నరసింహ రాజు, నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, సీనియర్ నాయకులు నాగుల గౌడ్, మాణిక్ రావు, గణేష్, జితేందర్, శ్రీనివాస్, శివరాజ్ , శివ రెడ్డి, రాము, పాపయ్య పాల్గొన్నారు.