శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ మంజీరా రోడ్డులో జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్, డిసి మోహన్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఇంజినీరింగ ఎస్ఈ శంకర్ నాయక్, డిఈ శ్రీదేవి, ఏఈ ప్రతాప్, అధికారులతో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. ఆర్టీసీ కాలనీ నుండి లింగంపల్లి బస్టాప్ వరకు నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు.