శేరిలింగంపల్లి, జూన్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదీనాగూడ ప్రభుత్వ పాఠశాలలో వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ స్థానిక నాయకులతో కలసి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు సహా ఉపాధ్యాయుల గోడును గమనించిన మహేష్ యాదవ్ వెంటనే విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ సహా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనితో పూర్వాపరాలు తెలుసుకున్న వారు సానుకూలంగా స్పందించి వారి లెటర్ హెడ్ ద్వారా రంగారెడ్డి జిల్లా డిఈవోకి సమస్యలను వివరించి పాత పాఠశాలను తొలగించి సాఫ్ట్ వేర్ కంపెనీ వర్తుస కార్పొరేషన్ ద్వారా నూతన భవన, తరగతి గదులను పునర్నిర్మాణం చేసి ఇచ్చేలా, ఆలాగే అప్ గ్రేడింగ్ 10వ తరగతి వరకు పెంచడంతో పేద మధ్య తరగతి ప్రజలకు లబ్ది జరుగుతుందని డిఈఓకి లెటర్ ద్వారా వివరించారు. దీంతో వారు వెంటనే స్పందించి పాఠశాల పునర్నిర్మాణం కోసం విద్యాశాఖ అధికారి పూర్ణచంద్రరావు చేతుల మీదగా ఎన్ఓసి పర్మిషన్ లెటర్ ను బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమణయ్య, సురేష్ కురుమ, సత్యనారాయణ, కుమార్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.