శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్‌పల్లి (పార్ట్) , వివేకానంద నగర్,హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు. GHMC ఇంజనీరింగ్ విభాగం, అన్ని విభాగాల అధికారులు కలిసి సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలపై అధికారులు నిర్లిప్తతను వీడాలని, తమ దృష్టికి ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యలపై స్పందించే అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE గోవర్ధన్, EE కిష్టప్ప, DE ఆనంద్, AE రాజీవ్, AE నిఖిల్, AE శ్రావణి, AE సాయి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.