శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వృద్ధురాలి మృతదేహం పడిఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళకు 60 నుంచి 65 ఏళ్ల వరకు ఉంటాయని, ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.