శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లి జోన్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ ని, డీసీ గంగాధర్ లను మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని కూకట్‌పల్లి (పార్ట్), వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, హైదర్ నగర్ డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలు, అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, పనులలో వేగం పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.