శేరిలింగంపల్లి, జూన్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ బస్తీ, గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ,హేమ దుర్గ టవర్స్, జనప్రియ అపార్ట్మెంట్స్, డాల్ఫిన్ టవర్స్ లలో ఏఈ ప్రతాప్,హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి మేనేజర్ హరి ఇతర అధికారులు, స్థానిక కార్పొరేటర్ పూజిత గౌడ్ తో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో నూతనంగా చేపటాల్సిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, కనకమామిడి నరేంద్ర గౌడ్, సుదర్శన్, సంజు సాగర్, ముజీబ్, కామోజీ, లాలూ పటేల్, హమీద్, కాసిం, కృష్ణ, పాషా, మల్లేష్, సంతోష్ , విల్సన్, శివప్ప తదితరులు పాల్గొన్నారు.