నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం ఖాయమని బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ అన్నారు. నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు బయల్దేరనున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని, బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకుని గచ్చిబౌలి కార్పొరేటర్ కార్యాలయానికి తరలించారు. పోలీసుల నిర్బంధాన్ని నిరసిస్తూ అక్కడే మౌన దీక్ష చేపట్టారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ లతో, నిర్బందాలతో ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఆక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు, ప్రజల మీద చూపిస్తున్న వివక్ష పాలనపై చేస్తున్న పోరాటాన్ని ఆపలేరన్నారు. 317 జీవో సవరణ కు ఒక రోజు రాత్రి శాంతియుతంగా జాగరణ దీక్ష చేపట్టిన చేపట్టిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆక్రమంగా అరెస్టును నిరసిస్తూ జేపీ నడ్డా ఇచ్చిన పిలుపు మేరకు కొవ్వొత్తుల ర్యాలీకి బయల్దేరకుండా బిజెపి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యం లో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ హక్కు ఉందని, వాటిని కాలరాస్తున్న ఈ ప్రభుత్వ చర్యలు హేయనీయమని అన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడడం తథ్యమని అన్నారు.