నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ గాంధీకి మోహన్ గౌడ్ పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేలా చూడాలని మోహన్ గౌడ్ ఆకాంక్షించారు.