నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీ సాయిరాం బ్రిక్స్ వారు రూపొందించిన నూతన సంవత్సరం 2022 డైరీని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆవిష్కరించారు. కొండాపూర్ డివిజన్ సెక్రటరీ, శ్రీ సాయిరాం బ్రిక్స్ యాజమాన్యం జె. బలరాం యాదవ్ తో పాటు తదితరులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కొండాపూర్ డివిజన్ టీఆర్ఎస్ కేవీ ఆటో యూనియన్ వాల్ స్టిక్కర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో కొండాపూర్ డివిజన్ టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరుక రమేష్, సీనియర్ నాయకులు జంగం గౌడ్, రవి శంకర్ నాయక్, హనుమంత రెడ్డి, అవదీష్ నారాయణ, రాజమోహన్ రావు, రమేష్ యాదవ్, కృష్ణ యాదవ్, మల్లేష్ యాదవ్, వెంకటేష్, సందీప్, పీవీఆర్ రాజు, రత్నం, సంతోష్, యువ నాయకులు వీరేష్, వీరన్న, రవి, సురేష్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

