శేరిలింగంపల్లి: నియోజకవర్గం లో ఇండ్లు లేని పేద వారు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి సొంతింటి కళ నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. మంగళవారం మియాపూర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు గతంలో వాంబే , జెఎన్ఎన్ యుఆర్ఎం (JNNURM) ఇండ్ల కోసం రిజిస్టర్ చేసుకొని కార్డు ఉండి ఇండ్లు కేటాయింపు జరగని లబ్ధిదారులు కార్డు తీసుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గానీ, రంగారెడ్డి జిల్లా గృహ నిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఈ నెల 12 వ తేదీ లోగా హోసింగ్ ఐడికార్డు , ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తో సంప్రదిస్తే మిగిలి ఉన్న ఇండ్లను కేటాయింపు చేసేలా చర్యలు తీసుకుంటామని అయన తెలిపారు. నియోజకవర్గం లో ఇండ్లు లేని నిరుపేదలు చాల మంది ఉన్నారని దశలవారీగా అందరికి ఇండ్లు కేటాయించే విదంగా తన వంతు కృషి చేస్తానని అయన అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గం లో డబుల్ బెడఁరూం ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అయన తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నామని అయన గుర్తు చేసారు.