కొండాపూర్ : కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువు కేబుల్ వంతెన సుందరీకరణ పనులను కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యవేక్షించారు. మంగళవారం పనులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు జరుగుతుందని, దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసుకొని వంతెన ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్నట్టుగా తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 184 కోట్ల వ్యయంతో చేపట్టిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పనులు అంత్యంత వేగంగా జరుగుతున్నాయన్నారు. దేశంలోనే అతి పెద్ద కేబుల్ బ్రిడ్జ్ నిర్మించిన ఘనత తెలంగాణ రాష్టానికే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
ఈ పర్యటనలు హమీద్ పటేల్ తో పాటు ఏఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, నరసింహ, యూత్ నాయకులు దీపక్, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.