పేదింటి ఆడబిడ్డల పెళ్లి బాధ్యతను టిఆర్ఎస్ ప్రభుత్వం భుజాలకెత్తుకుంది: ప్రభుత్వ విప్ గాంధీ

లబ్దిదారులకు చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ గౌడ్, నవత రెడ్డి తదితరులు

మియాపూర్: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డల పెళ్లి బాధ్యతను టిఆర్ఎస్ ప్రభుత్వం భుజాలకెత్తుకుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని చందానగర్, హఫీజ్ పెట్, మాదాపూర్ ప్రాంతాలకు చెందిన కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం లబ్ది దారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ గౌడ్, నవతా రెడ్డిలతో కలిసి హాజరైన ఎమ్మెల్యే దాదాపు 200 మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల పెండ్లి భారాన్ని పంచుకోవాలనే మంచి ఉద్దేశ్యంతో పెళ్ళికి కానుకగా కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పధకం ద్వారా రూ.1,00 ,116 /- రూపాయలు ఇవ్వడం పేద కుటుంబాలకు ఒక వరం లాంటిదన్నారు. ఈ పధకం పేదింటి ఆడపిల్లల తల్లితండ్రులకు ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చిందని, పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలబడటమే సీఎం కెసిఆర్ లక్ష్యం అని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామ లాగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లి ల భారాన్ని తగ్గిస్తున్నారని ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుక ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ అని తెలిపారు. ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత మన ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు RI చంద్రారెడ్డి ,RI మహిపాల్ రెడ్డి అటెండర్లు బాలరాజు ,సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్ , మాదాపూర్ డివిజన్ అద్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, హాఫీజ్పేట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్ మరియు , తెరాస నాయకులు లాక్ష్మ రెడ్డి,ప్రసాద్,సుధాకర్ ,రాంచందర్ ,ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here