- డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళుర్పించిన ప్రజా ప్రతినిధులు, వివిద పార్టీలు, ప్రజా సంఘాల నేతలు
నమస్తే శేరిలింగంపల్లి: రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు బుదవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వాడవాడల ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అస్పృశ్యతకు గురవతున్న బడుగు బలహీన వర్గాలకు సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించిన దేవుడు అంబెద్కర్ అని కొనియాడారు. సమాసమాజ నిర్మాణానికి ఆయన చేసిన సేవలు అజరామరం అని అన్నారు. ఆయన జ్ఞానాన్ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినమైన ఎప్రిల్ 14ను విశ్వవిజ్ఞాన దినోత్సవంగా జరపాలని పిలుపునివ్వడం దేశానికే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్లు మంజుల రఘునాథ్‌రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ రావు, రోజా రంగారావు, టీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సంజీవరెడ్డి, చందానగర్ అంబేద్కర్ యువజన సంఘం వేడుకల నిర్వహణ కమిటీ చైర్మన్ మందగడ్డ విమల్ కుమార్ సభ్యులు కంది జ్ఞనేశ్వర్, గంగాధరి రాఘవేందర్, మందగడ్డ నర్సింగ్ రావు, కంది చిన్న, మహెందర్, ఉదయ్‌కుమార్ నాయకులు రాఘవరావు, గుడ్ల ధనలక్ష్మీ, లక్ష్మీనారయణ, లక్ష్మారెడ్డి, వాలా హరీష్‌రావు, ఉరిటి వెంకట్‌రావు, రవీందర్ రెడ్డి, ప్రీతమ్, అక్బర్ ఖాన్, కృష్ణ దాస్, మిద్దెల మల్లారెడ్డి, పీవై రమేష్, ఓర్సు వెంకటేశ్వర్లు, పారునంది శ్రీకాంత్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్ అంబేద్కర్ నగర్‌లో శేరిలింగంపల్లి బిజేపి ఆద్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిదంగా చందానగర్, మక్త మహబూబ్ పేట్, పాటు వివిధ ప్రాంతాలలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గజ్జల యోగానంద్, గచ్చిబౌలి కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, రాఘవేంద్ర రావు, రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, కర్చర్ల ఎల్లేష్, సింధు రెడ్డి, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, రాజుశెట్టి, మనోహర్ ,రవి గౌడ్, వర ప్రసాద్, శ్రీశైలం కురుమ, కుమ్మరి జితేందర్, రాంరెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, రామకృష్ణ రెడ్డి, విజేందర్, బాబు రెడ్డి, పవన్, గణేష్ ముదిరాజ్, లలిత, స్వప్న రెడ్డి, అర్జున్, శివరాజ్,బాబు, రాము, వినోద్ యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొని అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
Advertisement