నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సునితా ప్రభాకర్‌రెడ్డి చందానగర్ పీఆర్‌కే హాస్పిటల్స్‌లో బుదవారం కోవాక్సిన్ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ సెకెండ్ వేవ్ కొనసాగుతుందని, గత ఏడాదితో పోలిస్తే వైరస్ ఉదృతంగా విస్తరిస్తున్నదని, ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో నామ మాత్రపు రుసుంతో ప్రభుత్వం సూచించిన 45 ఏళ్లకు పై బడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. ఈ కష్టకాలంలో వ్యాక్సిన్‌ను అందజేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సునిత ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.