నమస్తే శేరిలింగంపల్లి: కుకట్‌పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్ బాబు సభ్యులు, న్యాయవాదులు అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కోట్ల మంది భారతీయుల జీవితాల్లో వెలుగు నింపి, అక్షరాన్ని ఆయుదంగా మలిచి, ప్రంపంచానికే జ్ఞానాన్ని పంచిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. న్యాయవాదిగా, తొలి కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా న్యాయ వ్యవస్థకు ఎనలేని సేవలందించారని, చిన్నరాష్ట్రాలతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడే చిప్పిన దార్శనికుడని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కమ్మెట సురేష్, రమేష్, దేవిదాస్, న్యాయవాదులు హర్షవర్ధన్, కపిలేందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.