నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన సమస్యలు రోడ్లు , డ్రైనేజీ వ్యవస్థ, డంపింగ్ యార్డ్, పెండింగ్ పనులు పూర్తి చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో ప్రదీప్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ సాహు, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు రాజు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జి.శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.