సీసీ రోడ్డు పనులు పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం : కైతాపురం జితేందర్

శేరిలింగంప‌ల్లి, మార్చి 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్డు పనుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని కోరుతూ మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ‌శిరేఖ‌కు హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ హుడా కాలనీ, గంగారం గ్రామం, సాయి నగర్ , హఫీజ్ పేట్ గ్రామం కుమ్మర బస్తీలో సీసీ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, మొత్తం రోడ్ల పగుళ్లు అయ్యి నడవలేని పరిస్థితి, బైకులు, వాహనాల ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంద‌ని అన్నారు. ప్రజలు నిత్యం ఉపయోగించే రోడ్డు సరిగ్గా లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా పలుమార్లు వినతిపత్రం ఇచ్చినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని అన్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. మియాపూర్ డిప్యూటీ కమిషనర్ శ‌శిరేఖ స్పందిస్తూ వెంటనే పనులు ప్రారంభిస్తామని సంబంధించిన అధికారులకు సూచన ఇచ్చి, పనులు పూర్తి చేస్తామ‌ని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ అజిత్ సేనాపతి, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు, బిజెపి సీనియర్ నాయకులు వనమా శ్రీనివాస్ గుప్తా, మోహన్ ముదిరాజ్, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, టీ .శివ, బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, బీజేపీ నాయకులు అశోక్ ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్, హఫీజ్ పేట్ డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బాలరాజు , బీజేపీ నాయకులు అశోక్ కుమార్, హరీష్, చందు, నారాయణ, నరసింహ, మూర్తి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here