శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి వేం నరేందర్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేసిన నేపథ్యంలో గురువారం వేం నరేందర్ రెడ్డిని శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయని అన్నారు. భారతదేశ రాజ్య పాలన బాధ్యతలను కాంగ్రెస్ పార్టీకి అప్పగించడానికి ప్రజలు సమయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ సరెండర్ అయ్యాడని అది దేశ సమగ్రతకు విఘాతం అని అన్నారు. తెలంగాణ గడ్డ నుంచి ఢిల్లీ పార్లమెంట్ లోకి వేం నరేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడంతో దేశంలో రేర్ మార్క్ రాజకీయానికి తొలి అడుగు పడింది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరో సారి అధికారంలోకి వస్తారని, దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కాంప్రమైజ్డ్ పీఎంని దేశం చూసింది ఇకపై పోరాడే సత్తా ఉన్న వీరుడిని దేశం ప్రధానిగా చూడబోతుందని జోస్యం చెప్పారు.






