శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో అన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కోసం ప్రణాళికలు రచించేందుకు సమావేశం నిర్వహించారు. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను చర్చించారు. వార్డుల వారిగా చేపట్టాల్సిన పనులపై చర్చ జరిపారు.






