- కృతజ్ఞతలు తెలిపిన శ్రీరామ్ నగర్ కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ (ఏ బ్లాక్) కాలనీ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అసోసియేషన్ సలహాదారు షేక్ చాంద్ చాంద్ పాషా , అధ్యక్షుడు కే శివకుమార్ తెలిపారు.
కాలనీలో స్కూల్ బస్సులు వెళ్లేందుకు అసౌకర్యంగా ఉండటంతో రోడ్డుపై ఉన్న ర్యాంపులను తొలగించి, రాకపోకలకు అంతరాయం లేకుండా సమస్యను పరిష్కరించారు. అంతేకాక డ్రైనేజీ సమస్య, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు, విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ అభ్యున్నతికి ప్రోత్సాహాన్నిస్తున్న అసోసియేషన్ సలహాదారు షేక్ చాంద్ చాంద్ పాషా , అసోసియేషన్ అధ్యక్షుడు కే శివకుమార్, అసోసియేషన్ సభ్యులకు శ్రీరామ్ నగర్ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు