శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ లోని ప్రేమ్ నగర్ ఎ బ్లాక్ లో ఉన్న హఫీజ్‌పేట్ మున్నూరు కాపు భవనం వద్ద హఫీజ్‌పేట్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడిగా వాసాల రాజు పటేల్, అధ్యక్షుడిగా గాజుల మహేందర్ పటేల్, ప్రధాని కార్యదర్శిగా బత్తుల రవి పటేల్, కోశాధికారిగా మంగళరాపు చిన్న తిరుపతి పటేల్, కమిటీ సభ్యులుగా తాడేం మహేందర్ పటేల్, సాధన వేణి రాజు పటేల్, మంగళరాపు రజనీకాంత్ పటేల్, దేవులపల్లి బాలరాజు పటేల్, సుంకరి చందు పటేల్, కొలిపల్లి సతీష్ పటేల్, కాశెట్టి రమేష్ పటేల్, సుంకరి ఆంజనేయులు పటేల్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సమాజ ఐక్యతను బలోపేతం చేయడం, విద్యా రంగంలో విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం, యువతకు ఉపాధి అవకాశాలపై మార్గదర్శనం చేయడం వంటి లక్ష్యాలతో పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాదాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం పటేల్, మున్నూరు కాపు పటేల్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పటేల్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మంగళారపు లక్ష్మణ్ పటేల్, జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, గ్లోబల్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రజనీకాంత్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసాల వెంకటేశ్వర్లు పటేల్, గ్రేటర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఆర్ వి మహేందర్ పటేల్, శేరిలింగంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింగరావు పటేల్, హఫీజ్‌పేట్ మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు పోగుల సత్యనారాయణ పటేల్, పెరుక రమేష్ పటేల్, కూనవేణి రమేష్ పటేల్, మంగళరాపు తిరుపతి పటేల్ తదితరులు పాల్గొన్నారు.





