శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పేట్, చందానగర్ , భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.40,04,640 ఆర్థిక సహాయాన్ని 40 మంది లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చెక్కుల రూపేణా అందజేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






