శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని బి బ్లాక్ లో నివాసం ఉండే గోపాలకృష్ణ కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న అల్లావుద్దీన్ పటేల్ గోపాల కృష్ణ నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అంతిమయాత్రలో అల్లావుద్దీన్ పటేల్ పాల్గొని గోపాలకృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన కుటుంబానికి భరోసానిచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు అన్ని విధాలా మద్దతుగా ఉంటానని అల్లావుద్దీన్ పటేల్ తెలిపారు.






