కొమిరిశెట్టి సాయిబాబాను క‌లిసిన మున్నూరుకాపు సంఘం కార్యవర్గ సభ్యులు

శేరిలింగంప‌ల్లి, మార్చి 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మున్నూరుకాపు సంఘం కార్యవర్గ సభ్యులు శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాని గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్నూరుకాపు కార్యావర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సభ్యులకు శాలువా కప్పి సత్కరించారు. సంఘం సలహాదారులుగా రాజు పటేల్, తాడెం మహేంద్ర పటేల్ నియామ‌కం అవ‌గా, అధ్యక్షులుగా వాసాల రాజు పటేల్, గాజుల మహేందర్ పటేల్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల రవి పటేల్, కోశాధికారిగా మంగళారపు చిన్న తిరుపతి పటేల్, ఉపాధ్యక్షులుగా మంగళారపు రజనీకాంత్ పటేల్, దేవులపల్లి బాలరాజు పటేల్, సుంకరి చందు పటేల్, కార్యదర్శులుగా కాశెట్టి రమేష్ పటేల్, సుంకరి ఆంజనేయులు పటేల్, జాయింట్ సెక్రెటరీగా కోలిపల్లి సతీష్ పటేల్ లు నియామ‌కం అయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here