నమస్తే శేరిలింగంపల్లి : కాలేజీకి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. వివరాలు.. పటాన్ చెరువు లోని రెసొనెన్స్ కళాశాలలో జి. సంజీవ్ కుమార్ (17) విద్యనభ్యసిస్తున్నాడు. అయితే 22వ తేదీన తన ఇంటి నుంచి ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లేందుకు బయటికి వెళ్లాడు. తిరిగి రాలేదు. అయితే తన తండ్రి తిరుమలేశ్ (44)కు అతడి కుమారుడు హాస్టల్ కు, కాలేజీకి వెళ్లలేదని తెలియడంతో స్నేహితుల వద్ద ఆరా తీయగా.. మియాపూర్ మెట్రో స్టేషన్‌లో సంజీవ్ ను చూసినట్లు తెలిసింది.
4 -5 అంగుళాల పొడవు, తెల్లటి రంగు, హిందీ, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలిగి ఉంటాడని, తెల్లటి చొక్కా, నీలిరంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, తగిన చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేశాడు.