- ఉపాధ్యక్షులుగా కల్పన ఏకాంత్ గౌడ్, ఎలాల ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీగా సురారం ముత్యం రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షులుగా కల్పన ఏకాంత్ గౌడ్, ఎలాల ఈశ్వరయ్య, జనరల్ సెక్రటరీగా సురారం ముత్యం రెడ్డి నియమితులయ్యారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి ఈ నియామకాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాలను అందుకున్నారు. అనంతరం వారిని జగదీశ్వర్ గౌడ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు ఏ.రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం.నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ చల్లా నర్సింహ్మారెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ లకు, తమ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, వైస్ చైర్మన్ బి.కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా చైర్మన్ వీరేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సౌందర్యరాజన్ పాల్గొన్నారు.