నమస్తే శేరిలింగంపల్లి : బీసీల ఐక్యత కోసం ప్రతి ఒక్క బీసీ కృషి చేయాలని శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ కాలనీలో జై భవానీ యువజన విభాగం యువకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా బీసీ యూత్ సభ్యులు బీసీల ఐక్యమత్యానికి ప్రత్యేకంగా, బాధ్యతగా కృషి చేయాలని అన్నారు. బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దామాషా పద్ధతిన సమానవాట కల్పించాలని అన్నారు. సమావేశంలో తిరుమలేష్ యాదవ్, శివ, మహేష్, సాయి, ఆర్ మహేష్, ప్రవీణ్ యాదవ్, మధు ముదిరాజ్, మహేష్ పద్మశాలి, రాజు గౌడ్, మరియు యువ నాయకులు పాల్గొన్నారు.