కొనసాగుతున్న ఉచిత కంటి పరీక్షలు

నమస్తే శేరిలింగంపల్లి : సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ వద్ద ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు ఆ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్. వెంకటపాపయ్యనగర్, ఉజ్జయిని మహంకాళి నగర్, పంచమి బస్తి , ఆల్విన్ కాలనీ, ధరణి నగర్ కాలనీ వాసులకు దాదాపు 500 మందికి కంటి అద్దాలను అందజేశారు.


అనంతరం మాట్లాడుతూ సమాజానికి ఎవరైతే అవసరమో.. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేస్తూ అభివృద్ధిని కాంక్షించే వారికే రేపు పట్టం కట్టాలని కంటి పరీక్షల కోసం వచ్చిన లబ్ధిదారులకు భిక్షపతి యాదవ్ సూచించారు.


నేడు రాజకీయ నాయకులు ప్రజాసేవ పక్కన పెట్టి తన సొంత ప్రయోజనాల కోసం తప్పు దోవ తొక్కుతున్నారని తెలుపుతూ అంకితభావంతో ప్రజల పక్షాన నిలిచే నాయకులను ఎన్నుకొని తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వెంకటస్వామి రెడ్డి, యాదవ రెడ్డి, రామరాజు, కృష్ణ గౌడ్, కుమార్ యాదవ్, శ్రీకాంత్, రవీందర్ రెడ్డి, రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణరావు, నరసింహారెడ్డి, రాయల్, ఎత్తరి రమేష్, ఎస్ కే చాంద్, సుధాకర్, దేవీ రెడ్డి, పద్మ, సైదమ్మ ,అనూష పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here