నమస్తే శేరిలింగంపల్లి : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరిశ్వర్ రెడ్డి మృతి తీరని లోటని, ఆయన సేవలు మరువలేనివని పలువురు ప్రముఖులు కొనియాడారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలసి తన స్వగృహంలో ఆయన పార్దివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్.
కొప్పుల హరిశ్వర్ రెడ్డి కుమారుడు, వారి కుటుంబ సభ్యులను కలసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.