నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్, అమన్ కాలనీ, ఎం ఏ నగర్, శ్రీ లక్ష్మీ నగర్, టి ఎన్ నగర్ , ప్రశాంత్ నగర్, కేకే ఎన్ క్లేవ్ కాలనీలో రూ.1 కోటి 96 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి (యుజీడి) పైప్ లైన్ నిర్మాణ పనులకు, మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు, మ్యాన్ హోల్స్ పునరుద్ధరణ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ.. కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ, సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యమన్నారు. అనంతరం శంకుస్థాపన చేసిన వివరాలు వెల్లడించారు.
మాయూరి నగర్ కాలనీలో రూ. 50 లక్షల అంచనాతో, అమన్ కాలనీలో రూ. 85 లక్షల అంచనాతో, ఏం ఏ నగర్ , శ్రీ లక్ష్మి నగర్ , టి ఎన్ నగర్ కాలనీలో రూ. 6 లక్షల అంచనాతో నూతనంగా చేపట్టబోయే యుజి డి, మ్యాన్ హోల్స్ పునరుద్ధరణ మరమ్మతు పనులకు, మాయూరి నగర్ , ప్రశాంత్ నగర్ , కేకే ఏనక్లేవ్ కాలనీలో రూ. 55 లక్షల అంచనా వ్యయంతో మంచి నీటి పైపు లైన్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్లు సూచరిత, పూర్ణేశ్వరి, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.