నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా కప్పెర దుర్గేష్, ప్రధాన కార్యదర్శిగా దొంతి సాయి కిషోర్ ముదిరాజ్ నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని అన్నారు.

కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీ లో ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకే తాను పనిచేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ కి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రావుకి, జెరిపెటి జైపాల్ కి, మహిపాల్ యాదవ్ కి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ కి శేరిలింగంపల్లి అసెంబ్లీ అధ్యక్షుడు సౌందర్య రాజన్ కి ధన్యవాదాలు తెలిపారు.





