- రామోస్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..ఓటు హక్కు పై అవగాహన
నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని, ఓటు హక్కు పరిపాలన విధానానికి ఆయుధం లాంటిదని రామోస్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటు హక్కు పై అవగాహన కల్పించేందుకు తమ సంస్థ సభ్యులతో మియాపూర్ లో నిర్వహించిన సదస్సులో ఆయన హాజరై ప్రసంగించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుపుతూ.. ఇది ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా చేయాలని సభ్యులకు వివరించారు.
ఎలాంటి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగించుకోవటం ప్రజల ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. అప్పుడే దానికి సార్థకత ఉంటుందన్నారు. నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అని, ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దని సూచించారు.
- బంగారు భవిష్యత్తు కోసమే
దేశ దిశ, దశను ఓటు మారుస్తుందని, ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దండ సంపత్ రెడ్డి, రామ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ చైర్మన్ వి.తిరుపతి రెడ్డి, తెలంగాణ స్టేట్ వర్కింగ్ చైర్మన్ జీ వి రమణరావు, హనుమకొండ జిల్లా జనరల్ సెక్రెటరీ క్రాంతి కుమార్, జనగామ జిల్లా చైర్మన్ మరపక కుమార్, హనుమకొండ జెయింట్ సెక్రటరీ కోతి రవీందర్, ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ నరసింహ, రంగారెడ్డి జిల్లా చైర్మన్ కొమ్ముల శ్యామ్, శేరిలింగంపల్లి మండల్ చైర్మన్ సూర్య కుమార్, గ్రేటర్ వరంగల్ జనరల్ సెక్రెటరీ పి.సురేందర్, కవిత పాల్గొన్నారు.