నమస్తే శేరిలింగంపల్లి: సుస్థిర పాలన బిఆర్ఎస్ తోనే సాధ్యమని, బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమం నచ్చి.. ప్రజలు పార్టీ గెలుపు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దీప్తిశ్రీ నగర్ కాలనీ, జవహర్ నగర్ కాలనీ, చందానగర్, వేమన రెడ్డి కాలనీ, విశ్వేశ్వర కాలని, కేఎస్ఆర్ ఎన్ క్లేవ్ కాలనీలలో భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనుబంధ సంఘాలతో మంజుల రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ బైకు ర్యాలీ నిర్వహించారు. దీప్తిశ్రీ నగర్ నిర్వహించిన బైకు ర్యాలీలో పాల్గొని ఓటు అభ్యర్ధించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని, అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఏస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన గాంధీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఏస్ పార్టీ నాయకులు లక్ష్మినారాయణ గౌడ్, జనార్ధనరెడ్డి, లక్ష్మ రెడ్డి, మిర్యాల రాఘవరావు, పులిపాటి నాగరాజు, పబ్బా మల్లేష్ గుప్తా, ఓ.వేంకటేష్, అక్బర్ ఖాన్, అమంజద్, యుసుప్ పాల్గొన్నారు.