రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతాం : ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో లంబాడాలపై జరుగుతున్న రాజకీయ కుట్రలను, తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని లంబడ హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. సందర్భంగా ఆ సమితి సభ్యులు మాట్లాడుతూ ఇటీవల తమ మిత్రులు వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల లంబాడ ప్రజలను నివసిస్తున్నారని తమకు ఎమ్మెల్యే సీట్లు పంచాలని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా.. దానికి రేవంత్ రెడ్డి ఇలా ( ఒక వెయ్యి రూపాయలు ఇస్తే గుడుంబా తాగి తందనాలడీ, తమ వెంట జెండాలు పట్టుకుని తిరిగే మీకు ఎమ్మెల్యే సీట్లు ఎందుకని) అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని నినాదాలు చేస్తున్న దృశ్యం

ఇదేకాక మరొక బహిరంగ సభలో తమ కులదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఆయనకు అందించే క్రమంలో తమ సభ్యులను పక్కకు నెట్టివేసారని, తమ ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని, తమ బంజారాల నుంచి ఒక్క ఓటు కూడా పడకుండా చేస్తామని హెచ్చరించారు. ఆ సేవా సంఘం స్టేట్ జాయింట్ సెక్రెటరీ బి. ఆల్వార్ స్వామి నాయక్, సీతారాం నాయక్, టిజిఎస్ఎస్ స్టేట్ కన్వీనర్ బి. మురళీకృష్ణ, గోడు నాయక్, జితేందర్ నాయక్, లక్ పతి నాయక్, నరేష్ నాయక్ పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here