నమస్తే శేరిలింగంపల్లి : వివేకానందుడి బోధనలను అనుసరించి, దేశంపట్ల ప్రేమను పెంచుకోవాలని బిజెపి నేత, గౌతమీనగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. వివేకానందుడి 122వ వర్ధంతి సందర్భంగా కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ వివేకానంద ఆశయాలకు అనుగుణంగా యువత సిద్ధం కావాలని, మత్తు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన దేశ యువత ప్రపంచంతో పోటీపడుతున్నారని, మన ఆర్థిక వ్యవస్థకు భవిష్యత్తు ఆశాకిరణాలని కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నూనె సురేందర్, ప్రధాన కార్యదర్శి బాదం సాయిబాబు, అశోక్ కుమార్, రామస్వామి, నర్సింహ, భవానీ, స్వాతి, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.