నమస్తే శేరిలింగంపల్లి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించిన మహానుభావుడు, కులమత బేధం లేని మహనీయుడు వంగవీటి రంగా అని జనసేనా పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి అన్నారు. వంగవీటి రంగా జయంతి సందర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఎల్లమ్మ బండ ఆల్విన్ కాలనీ లో ఆ మహానుభావుడి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు అబోతుల మాధవరావు, లింగంపల్లి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ దొంతొజు ఇందుమతి, హఫీజ్పేట్ డివిజన్ అధ్యక్షురాలు మద్దూరి నాగలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ , వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ సాహు, హైదర్ నగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ , మరియు వివిధ కో ఆర్డినేటర్ లు ప్రదీప్, అరవింద్ మింటు, శివ, జన సైనికులు, శ్రీ కృష్ణ దేవరాయ కాపు సంఘ సభ్యులు పాల్గొన్నారు.