నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర చేపట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రతికూల వాతావరణం సైతం లెక్క చేయకుండా, అసౌకర్యం అయినప్పటికీ ప్రజలు స్వచ్చందంగా స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని మద్దతు తెలపడం పట్ల జగదీశ్వర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్ధించారు.