- భారీ వర్షాన్ని లెక్క చేయకుండా ముందుకొచ్చిన ప్రజలు
- పార్టీలో చేరిన బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నాయకులు
- సాదరంగా ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: భారీ వర్షం సైతం లెక్క చేయకుండా యువకులు, మహిళలు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కి మద్దతుగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలిపారు.
ఇందులో భాగంగానే లింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ ఎత్తున బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలు జగదీశ్వర్ గౌడ్ ని కలవడానికి ఉత్సాహం చూపారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ గెలుపు స్పష్టమైందని, మెజారిటీ కోసమే తమ ప్రయత్నమని తెలిపారు.
ప్రజలు తనపై చూపిస్తున్న ఈ ప్రేమకు ఎల్లప్పుడు కృతజ్ఞుడై ఉంటానని, ఏ సమస్య వచ్చిన తోడుగా ఉండి పరిష్కరిస్తానని తెలిపారు.