- మియాపూర్, మాదాపూర్ డివిజన్ మాతృ శ్రీ నగర్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీలో బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల అభివృద్ధి , భవిష్యత్తు కోసం మంచి పాలనను అందించే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ రవికుమార్ యాదవ్ కోరారు.
మియాపూర్ డివిజన్ నాయకులు , మాదాపూర్ డివిజన్ మాతృ శ్రీ నగర్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటు బి.ఆర్.ఎస్ కు సీటు, రెండు పార్టీలు ఒక్కటేనని, ఓటు వృధా చేసుకోవద్దని, ఈ విషయాన్ని ప్రజలు అందరూ గమనించాలని కోరారు.