నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా వివేకానంద నగర్ డివిజన్ లోని స్థానిక మహిళలకు గౌరవప్రదంగా మెమోంటోలు అందజేసిన సన్మానించారు.
ఈ సందర్భంగా విద్యాకల్పన మాట్లాడుతూ మహిళ తన కుటుంబ బాధ్యతను నిర్వహిస్తూనే.. సమాజం పట్ల తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ అన్నిరంగంలో ముందుటుందని గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును, హోదాను సంపాదించుకుటున్నారని, ఇందుకు ఉదాహరణ స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరగాంధీ అని అన్నారు.
కార్యక్రమంలో డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ భాషిపాక నాగమణి, సంధ్య, శృతి గౌడ్, షాలిని, నాగమణి, వనజ, కళ్యాణి, అంజమ్మ, రాధమ్మ, పద్మ, ఉపేంద్ర, మంజుల, ఉష, స్థానిక మహిళలు పాల్గొన్నారు.