నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చేపట్టిన కథక్ కూచిపూడి నృత్యప్రదర్శనలు అలరించాయి. వారణాసి మేధా గణేష్, మేఘ నగరద్ తమ ప్రదర్శనలో శివ వందన, శివ తాండవ, కృష్ణ వందన మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
శ్రీదేవి నాట్యాలాయ గురువు శ్రీదేవి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో గణేశా పుష్పాంజలి, వినాయక కౌతం, పుష్పాంజలి, సతులారా, అలరింపు, అన్నమాచార్య కీర్తనలు, భో శ్మభో మొదలైన అంశాలను జోత్స్నా , వైష్ణవి, నక్షత్ర, దీప్తి, రోషిని, జయేష్, అక్షర, హన్సిక, శాన్వి నందిత మొదలైన కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.